పేదల బతుకులు మారుస్తా

ధర్మసాగర్, వెలుగు: పేదల బతుకులు మార్చే ఏకైక పార్టీ బీఎస్పీ అని పార్టీ స్టేట్​ చీఫ్ ​కో ఆర్డినేటర్ ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్ ​చెప్పారు. దేశ సంపదను అన్ని వర్గాల పేదలకు సమానంగా పంచాలన్నదే తమ లక్ష్యమన్నారు. బహుజన రాజ్యాధికార యాత్ర 6వ రోజు జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని వేలేరు, నారాయణగిరి, ముప్పారం, ధర్మసాగర్, ఎల్కతుర్తి, క్యాతంపల్లి, పెద్ద పెండ్యాల, చిన్న పెండ్యాల,శివునిపల్లిలో కొనసాగింది. ముప్పారం, ధర్మసాగర్ లో ఏర్పాటు చేసిన సభలో ప్రవీణ్​కుమార్ ​మాట్లాడుతూ పేదల బతుకులు మార్చడానికే పోలీసు ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ధర్మసాగర్ మండల కేంద్రంలో మరుగుదొడ్లు లేకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు.75 ఏళ్ల స్వతంత్ర భారతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల బతుకులు ఏ మాత్రం మారలేదని అన్నారు. ఇంకెంతకాలం వెట్టిచాకిరీలో బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా బీఎస్పీ నిరంతరం పోరాడుతోందని చెప్పారు. రాజ్యాధికారం సాధిస్తే పేదల సమస్యలు పరిష్కారమవుతాయని వివరించారు. ఈ సందర్భంతతగా ఓ మహిళ యాత్రకు  రూ. 10 వేలు విరాళంగా ఇచ్చారు. రాజ్యాధికార యాత్రను ఆశీర్వదించి, ఆర్థికంగా సహకరించాలని ప్రవీణ్​కుమార్​ కోరారు.