హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపుపై బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. కరెంటు చార్జీల పెంపు సీఎం కేసీఆర్ అసమర్థ పాలనకు అద్దం పడుతోందన్నారు. డిస్కంలకు చెల్లించాల్సిన రూ.17,202 కోట్ల విద్యుత్ బకాయిల్ని చెల్లించకుండా.. ప్రభుత్వం ఇష్టానుసారం చార్జీలు పెంచడం దారుణమని దుయ్యబట్టారు. పనుల్లేక ప్రజలు ఆర్థికంగా కష్టాలు పడుతుంటే.. గుట్టుచప్పుడు కాకుండా టీఆర్ఎస్ సర్కార్ చార్జీలు పెంచి పేదలపై మరింత భారం మోపిందన్నారు. ఇలాంటి దొంగ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు నెలవారీ గృహ వినియోగ విద్యుత్తును 100 నుంచి 200 యూనిట్లకు పెంచి, ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ చార్జీల పెంపు #KCR అసమర్ధపాలనకు నిదర్శనం.అసలే పనుల్లేక నిరుపేదలు,మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా కష్టాలు పడుతుంటే, గుట్టు చప్పుడు కాకుండా #TRS ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచి పేదలపై మరింత భారం మోపింది. ఇటువంటి దొంగ ప్రభుత్వాన్ని మనం గద్దె దించాలె#KCRFailedTelangana pic.twitter.com/g2UfDKNtDM
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) March 24, 2022
మరిన్ని వార్తల కోసం: