కరీంనగర్: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగం పేరుతో మోసపోయి ఆత్మహత్య చేసుకున్న హరీష్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్ ఇంటి ముందు బీఎస్పీ నాయకులు ధర్నా చేపట్టారు. బాధితుడు హరీశ్ ఆత్మహత్యకు బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రాజీనామా చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. నినాదాలు చేస్తూ మంత్రి గంగుల కమలాకర్ ఇంటి ముందు ఆందోళన చేస్తున్న బీఎస్పీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులు, కేసులతో అడ్డుకోలేరని.. హరీశ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని బీఎస్పీ నాయకులు స్పష్టం చేశారు.