పారిశుధ్య కార్మికులను కేసీఆర్ మోసం చేస్తున్నారు : ఆర్ఎస్ ప్రవీణ్

పారిశుధ్య కార్మికులను కేసీఆర్ మోసం చేస్తున్నారు : ఆర్ఎస్ ప్రవీణ్

పారిశుధ్య కార్మికులను కేసీఆర్ మోసం చేస్తున్నారు

పాలన అంతా అవినీతిమయంగా మారింది : ఆర్ఎస్ ప్రవీణ్

కాగజ్ నగర్, వెలుగు : కేసీఆర్ పాలన పూర్తిగా అవినీతిమయంగా మారి కంపు కొడుతున్నదని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. పారిశుధ్య కార్మికులను సీఎం మోసం చేస్తున్నారన్నారు. బహుజన రాజ్యా ధికార యాత్రలో భాగంగా సిర్పూర్ నియోజకవర్గంలో మూడో రోజు పర్యటించారు. మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో మాట్లాడారు. బాలభారతి ఎయిడెడ్ స్కూల్​ను సందర్శించారు. తర్వాత కాగజ్ నగర్ మండలంలోని అందెవెల్లి దగ్గర పెద్దవాగు బ్రిడ్జిని పరిశీలించి మాట్లాడారు. కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు కట్టుకునే ఫామ్​హౌస్​లకు 80 ఫీట్ల వెడల్పుతో రోడ్లు వేసుకుంటున్నారని విమర్శించారు. 

కాగజ్​నగర్ – దహెగాం మండలాల మధ్య 70 గ్రామాలను కలిపే పెద్దవాగు బ్రిడ్జి కూలి పోయి ఏడాది అవుతున్నా ఇప్పటికీ కంప్లీట్ చేయలేదన్నారు. కాగజ్​నగర్​లోని బాల భారతి ఎయిడెడ్ స్కూల్​లో ఎంతో మంది చదివి ఉన్నత స్థాయికి చేరారని, ఇప్పుడు ఎస్పీఎం నడుపుతున్న జేకే యాజమాన్యం బలవంతంగా స్కూల్​ను మూయించేందుకు ప్రయత్నిస్తున్నదని అన్నారు. స్కూల్ నడిపేందుకు బీఎస్పీ తరఫున విరాళాలు ఇస్తామని ప్రకటించారు.