![దొరల పాలనకు చరమ గీతం పాడాల్సిందే](https://static.v6velugu.com/uploads/2022/05/BSP-state-co-ordinator-RS-Praveen-Kumar-alleged-that-people-were-being-misled-in-the-name-of-free-schemes_tNKnozdbJU.jpg)
ఉచిత పథకాల పేరుతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కురవి మండల నేరడ గ్రామానికి చేరుకున్నారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హమాలీలతో మాట్లాడి లారీలోకి బస్తాలను మోశారు. ఎన్నికల ముందు ఉచిత పథకాలు, మధ్యం ,డబ్బులు పంపిణీ చేసి గద్దెనెక్కుతున్నారని మండిపడ్డారు. దొరల పాలనకు చరమ గీతం పాడి.. బహుజనుల రాజ్యాదికారం సాధించాలని కోరారు.
మరిన్ని వార్తల కోసం