కేసీఆర్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరు

మహబూబాబాద్: రాష్ట్రంలో దొరలకు అధికారమిస్తే తమకు గడీలు నిర్మించకున్నారే తప్ప పేదలకు ఇళ్లు నిర్మించలేదని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. జిల్లాలో 73వ రోజు బహుజన రాజ్యాధికార యాత్రను కొనసాగించారు. బ్రాహ్మణ కొత్తపల్లి, నెల్లికుదురు, రావిరాల గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. బ్రహ్మణ కొత్తపల్లి లో అసంపూర్తిగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో ఇళ్లు లేక చాలా మంది ఇబ్బంది పడుతోంటే... రాష్ట్ర నిధులను పంజాబ్ రైతులకు పంచడమేంటని కేసీఆర్ పై మండిపడ్డారు.

తెలంగాణ వ్యతిరేకులైన ఆంధ్రా పెట్టబడిదారులకు కేసీఆర్ కాంట్రాక్టులు ఇస్తున్నారని ఆరోపించారు. ఉపాధి హామీ కూలీ వేతనాలు తక్కువగా ఉన్నాయని, అవి కూడా సమయానికి రావడం లేదన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజలు తీవ్ర నిరాశలో  బతుకుతున్నారని తెలిపారు. ఇదేనా బంగారు తెలంగాణ అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వస్తేనే బహుజనుల బతుకులు మారుతాయని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తల కోసం...

రాష్ట్రంపై విషం కక్కిన ప్రధాని మోడీ

ఢిల్లీ ఎల్జీగా వినయ్ కుమార్ సక్సెనా ప్రమాణం