భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: అభివృద్ధి పేర బీఆర్ఎస్ప్రజాప్రతినిధులు, లీడర్లు ప్రజల సొమ్మును దోచుకున్నారని బీఎస్పీ స్టేట్జనరల్సెక్రెటరీ యెర్రా కామేశ్ఆరోపించారు. కొత్తగూడెంలోని నాలుగో వార్డులో ఆదివారం ఆయన ఇంటింటికీ బీఎస్పీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కామేశ్మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్ పర్సన్కె.సీతాలక్ష్మి కొత్తగూడెం టౌన్అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఫండ్స్తెచ్చింది లేదని విమర్శించారు.
టౌన్ప్రజలకు మురుగు నీరే దిక్కైందన్నారు. అపరిశుభ్రతకు నిలయంగా మారిందన్నారు. దోమలతో స్థానికులు అల్లాడుతున్నారని మండిపడ్డారు. పారిశుద్ధ్యం విషయంలో పాలకులు, మున్సిపల్ఆఫీసర్లు ఫెయిల్ అయ్యారన్నారు. ఆయన వెంట బీఎస్పీ నేతలు గంధం మల్లికార్జున్‌రావు, సీహెచ్ నిరంజన్, కోటి, అరవింద్ ఉన్నారు.