- బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్
కాగజ్ నగర్, వెలుగు : సిర్పూర్ నియోజకవర్గం కౌటాల మండలంలోని కన్నెపల్లి -ఎడ్లగూడ మధ్య ఐటీడీఏ నిధుల కింద మంజూరైన బీటీ రోడ్డు భూమి పూజకు స్థానిక ఎంపీటీసీ దుర్గం మోతీరాంను ఆహ్వానించకపోవడం ప్రోటోకాల్ ఉల్లంఘనే అవుతుందని, దళితుడు కావడంతోనే ఎంపీటీసీని పిలవలేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
బీఎస్పీకి చెందిన ఎంపీటీసీకి సమాచారం ఇవ్వకుండా అధికారులు రోడ్డు పనులు ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. ఎంపీటీసీ దళితుడైనందు వల్లే ఆధిపత్య వర్గాలకు చెందిన స్థానిక ఎమ్మెల్యే హరీశ్ బాబు ప్రోటోకాల్ పాటించలేదని ఇది ముమ్మాటికి ప్రజా ప్రతినిధిని అవమానించడమేనన్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.