నా ఐ ఫోన్ ను ప్రభుత్వం హ్యాక్ చేస్తోంది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 

నా ఐ ఫోన్ ను ప్రభుత్వం హ్యాక్ చేస్తోంది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 

ప్రభుత్వంపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. తన ఐ ఫోన్‌ను ప్రభుత్వం హ్యాక్ చేస్తోందంటూ ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. తన ఫోన్ హ్యాక్ అవుతోందంటూ.. యాపిల్ సంస్థ నుంచి మెయిల్ వచ్చిందని తెలిపారు. ఆ మెయిల్‌ను కూడా ట్విట్టర్‌లో షేర్ చేశారు. 

ప్రభుత్వ సహకారం లేకుండా ఐ ఫోన్లను హ్యాక్ చేయలేరని యాపిల్ సంస్థ వెల్లడించిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. ‘మీలా నా ఐ ఫోన్ ను ధ్వంసం చేయను. జాగ్రత్తగా ఉండమని నన్ను యాపిల్ కంపెనీ హెచ్చరించింది. కానీ, మీ దోపిడీ, చీకటి సామ్రాజ్యాలను ధ్వంసం చేసి, మా మహనీయులు కలలు కన్న బహుజన రాజ్యాన్ని నిర్మిస్తా’ అని ట్విట్టర్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. 

ఇప్పటికే చాలామంది ఐ ఫోన్లు హ్యాక్ అవుతున్నట్లు యాపిల్ కంపెనీ హెచ్చరికలు జారీ చేసింది. యాపిల్ హెచ్చరించిన వారిలో ప్రముఖ జర్నలిస్టులు, సోషల్ యాక్టివిస్టులు ఉన్నారు. 

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ పై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఆరోపణలు చేసింది. తమ ఫోన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం హ్యాక్ చేస్తోందని ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి నాయకులు ఆరోపించిన సంగతి తెలిసిందే.