ఓటమి ద్వారా చాలా గుణపాఠాలు నేర్చుకున్నాం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ఓటమి ద్వారా చాలా గుణపాఠాలు నేర్చుకున్నాం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై  బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. తెలంగాణలో చారిత్రాత్మక విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి, ముందుండి నడిపించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. బహుజన్ సమాజ్ పార్టీకి (బీఎస్పీ) ఈ ఫలితాలు (సిర్పూర్ ఫలితంతో సహా) కొంత నిరాశ కలిగించినా చాలా గుణపాఠాలు నేర్చుకున్నామన్నారు. భవిష్యత్తులో బహుజనవాదాన్ని గడప గడపకు తీసుకొని వెళ్లి, పేదలకు గొంతుకగా ఉండడమే తమ ముందున్న కర్తవ్యం అని చెప్పారు. 

మహనీయుల ఆశయాల కోసం రాత్రింబవళ్లు  శ్రమించిన బీఎస్పీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తల కష్టాన్ని వృథా కానివ్వనని చెప్పారు. అంతేకాదు.. సిర్పూరు ఎమ్మెల్యేగా  ఎన్నికైన డా. హరీష్ బాబుకి అభినందనలు తెలియజేశారు.