అభివృద్ధి పేరుతో అవినీతి చేసిన మంత్రి : వట్టె జానయ్య యాదవ్

  •     బీఎస్పీ సూర్యాపేట అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేటలో అభివృద్ధి పేరిట మంత్రి జగదీశ్ రెడ్డి అవినీతి చేశారని బీఎస్పీ సూర్యాపేట అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్ ఆరోపించారు.  దమ్ముంటే అభివృద్ధిపై జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్ లో బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. ఆదివారం  పట్టణంలోని 45 వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్, 38వ వార్డు కౌన్సిలర్ గండూరి రాధిక రమేశ్‌‌‌‌తో పాటు వివిధ గ్రామాలకు చెందిన నేతలు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు రాజీనామా చేసి బీఎస్పీలో చేరారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ పావని కృపాకర్ మాట్లాడుతూ.. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లో మహిళలకు గౌరవం లేదని,  ఒక మహిళను జడ్పీటీసీ ఇబ్బందులు పెడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని మండిపడ్డారు.  గండూరి రాధిక రమేశ్ మాట్లాడుతూ.. తెలంగాణ పేరు చెప్పుకునే మంత్రి పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం చెయ్యి విరిగితే ఇప్పటివరకు రిపేర్‌‌‌‌‌‌‌‌ కూడా చేయలేదని విమర్శించారు.  

అనంతరం జానయ్య మాట్లాడుతూ..  మంత్రి   జగదీశ్ రెడ్డి మెడికల్ కాలేజీ బ్లూ ప్రింట్ మార్చి రూ. 500 కోట్లలో కేవలం రూ. 150 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని,  మిగితా డబ్బుతో ఫామ్ హౌస్ కట్టుకున్నారని ఆరోపించారు. మినీ ట్యాంక్ బండ్ నిర్మాణంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, నిరూపించడానికి ఎక్కడికి రమ్మన్నా వస్తానని సవాల్ విసిరారు.  

పార్టీ లో చేరిన వారిలో వ్యాపారవేత్త బొమ్మగాని సైదులు గౌడ్, వైఎస్సార్‌‌‌‌‌‌‌‌టీపీ చివ్వెంల మండల అధ్యక్షుడు నెమ్మాది మల్సూర్, బీజేపీ ఉపాధ్యక్షుడు కోదాటి  విజయకుమార్,  రాయినిగూడెం మాజీ సర్పంచ్‌‌‌‌ ముత్యాల సైదులు, నేతలు ఇట్టిమల్ల స్టాలిన్, చింతల సురేశ్,  శ్రీనివాస్ రెడ్డి,  గంపల రవిచంద్ర, ఇట్టిమల్ల విక్రం, హేమంత్ తదితరులు ఉన్నారు.