తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్ స్ట్రాంగ్ దారుణ హత్యకు గురయ్యారు.శుక్రవారం రాత్రి చెన్నై పెరంబూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బైకుపై వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కత్తులతో దాడి చేసి చంపారు. ఈ దాడిలో ఆర్మ్ స్ట్రాంగ్ వెంట ఉన్న మరో ఇద్దరికి గాయాలయ్యాయి.దాడి జరిగిన వెంటనే ఆయన్ను స్థానిక రాజీవ్ గాంధీ జనరల్ హాస్పిటల్ కు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్దారించారు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
దాడి ఆయన ఇంటికి సమీపంలోనే చోటు చేసుకుందని సెంబియమ్ పోలీసులు తెలిపారు. ఫుడ్ డెలివరీ బాయ్స్ గెటప్ లో వచ్చిన దుండగులు.. పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడుతుండగానే కత్తులతో దాడి చేశారని ప్రత్యక్ష సాక్షులు వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
The gruesome killing of Mr. K. Armstrong, Tamil Nadu state Bahujan Samaj Party (BSP) president, outside his Chennai house is highly deplorable and condemnable. An advocate by profession, he was known as a strong Dalit voice in the state. The state Govt. must punish the guilty.
— Mayawati (@Mayawati) July 5, 2024
ఈ హత్యపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఆయన మృతిపై పలువురు నేతలు సంతాపం తెలియజేసారు.ఇదిలా ఉండగా, ఈ కేసులో శనివారం వేకువజామున 8 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హత్యకు రాజకీయ వైరమా.. వ్యక్తిగత కక్షలా.. అన్నది తేలాల్సి ఉంది.