
ఆత్మహత్య.. విద్యార్థుల్లో ఎందుకు ఇలాంటి ఆలోచన వస్తుందో తెలియదు.. చక్కగా చదువుకోటానికి కాలేజీకి వచ్చిన విద్యార్థిని.. వందల మంది స్టూడెంట్స్ ముందు.. యూనివర్సిటీ బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి దూకి చనిపోవటం సంచలనంగా మారింది.
హైదరాబాద్ సిటీ పటాన్ చెరులో ఉన్న గీతం యూనివర్సిటీలో జరిగిన.. శ్రీ అనే 18 ఏళ్ల బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఐదో అంతస్తు నుంచి అందరూ చూస్తుండగా.. ఇంత పని చేసింది. విద్యార్థిని శ్రీ ఆత్మహత్య ఘటన వీడియో రికార్డ్ కావటం.. ఆ వీడియో చూసినోళ్లకు నోట మాట రావటం లేదు..