జేఎన్​టీయూ స్టూడెంట్ల రాస్తారోకో

జేఎన్​టీయూ స్టూడెంట్ల రాస్తారోకో

వనపర్తి, వెలుగు : వనపర్తిలోని జేఎన్​టీయూ కాలేజీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని బీటెక్​ స్టూడెంట్లు మంగళవారం వనపర్తి -గోపాల్​పేట రోడ్డుపై ధర్నా, రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ మాట్లాడుతూ..  జేఎన్​టీయూ కాలేజీని ప్రస్తుతం పీజీ సెంటర్​లో కాకుండా సొంత బిల్డింగు నిర్మించి అందులో నిర్వహించాలన్నారు. హాస్టల్​ ఫెసిలిటీ కల్పించాలని, ల్యాబులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.  

కాలేజీలో అయిదు బ్రాంచీల్లో 960 మంది చదువుతున్నారని, విద్యార్థినులకు జిల్లా కేంద్రంలో ఇది వరకు నడిచిన ఓ ప్రైవేటు ఆసుపత్రి భవనంలో హాస్టల్​ సౌకర్యం కల్పించారన్నారు. అక్కడా భోజనం సరిగా పెట్టడం లేదని, వాటర్​ ఫెసిలిటీ కూడా లేదని వాపోయారు. బాత్​రూమ్​లు సరిపోయినన్నీ లేవని ఆరోపించారు.  కలెక్టర్, ఎమ్మెల్యే, మంత్రి స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.