కాలేజీ ఫీజుతో బెట్టింగ్.. స్టూడెంట్ సూసైడ్

కాలేజీ ఫీజుతో బెట్టింగ్.. స్టూడెంట్ సూసైడ్

ఘట్ కేసర్, వెలుగు:  కాలేజీ ఫీజు డబ్బులను బెట్టింగ్ లో పెట్టి మోసపోయిన బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు తెలిపిన ప్రకారం.. నల్లగొండ టౌన్ కు చెందిన కొండూరు శ్రీను, లక్ష్మిల కొడుకు నితిన్(21), మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ యంనంపేట్ లోని శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలో బీ టెక్ థర్డ్ ఇయర్ చదువుతూ స్థానికంగా హాస్టల్ లో ఉంటున్నాడు. 

కొడుకు కాలేజ్ ఫీజ్ కట్టేందుకు శ్రీను తన భూమిని అమ్మి రూ.3.30 లక్షలను పంపించారు. నితిన్ ఆన్ లైన్ బెట్టింగ్ లు పెట్టి డబ్బులు కోల్పోయాడు. దీంతో కాలేజీ ఫీజు కట్టలేక, పేరెంట్స్ కు చెప్పి అడగలేక తీవ్ర మనస్తాపంతో మంగళవారం తెల్లవారుజామున యంనంపేట్ వద్ద రైలు కింద పడి  ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు చూసి పోలీసులకు తెలపగా డెడ్ బాడీని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించి కేసు నమోదు చేశారు.