ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్​కు​ బీటీఎఫ్, టీటీఏ మద్దతు

ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్​కు​ బీటీఎఫ్, టీటీఏ మద్దతు

హైదరాబాద్, వెలుగు: వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎంఎల్​సీ అభ్యర్థి పూల రవీందర్ కు బహుజన టీచర్స్ ఫెడరేషన్ (బీటీఎఫ్), ట్రైబల్ టీచర్స్ అసోసియేషన్ (టీటీఏ) సంఘాలు మద్దతు ప్రకటించాయి.

 ఆదివారం హైదరాబాద్​లో పూల రవీందర్ ను బీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యాదగిరి,  రవీందర్, టీటీఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరికిషన్, శ్రీనివాస్ నాయక్ తదితరులు వేర్వేరుగా కలిసి మద్దతు లేఖలు అందించారు. బీసీ అభ్యర్థి పూల రవీందర్ ను గెలిపించాలని వారు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.