ప్లాస్టిక్‌‌ వేస్ట్‌‌తో మొబైల్‌‌ ఫోన్‌‌

ఈ కాలంలో కాలుష్యం బాగా పెరిగిపోయింది. సముద్రాలు, నేల, గాలి ఇలా అన్నీ కలుషితం అయిపోతున్నాయి. కాలుష్యాన్ని  తగ్గించడం కోసం చాలామంది వాళ్లకు తోచిన పని చేస్తున్నారు. అందులో భాగంగా క్లీన్‌‌ చేయడమో, అవేర్‌‌‌‌నెస్‌‌ ప్రోగ్రామ్స్‌‌ పెట్టడమో చేస్తుంటారు. సముద్రంలో పేరుకుపోతున్న  ప్లాస్టిక్‌‌ను చాలా రకాల సముద్ర జీవులు తిని లేదా వాటిలో ఇరుక్కుపోయి చనిపోతున్నాయి. దీన్ని ఆపేందుకు సముద్రంలో ఉన్న ప్లాస్టిక్‌‌ చెత్తను తీసేయాలని ఎలక్ట్రానిక్‌‌ సంస్థ సామ్‌‌సంగ్‌‌ ప్లాన్‌‌ చేసింది. ఫిబ్రవరి 9 న జరిగిన సామ్‌‌సంగ్‌‌ అన్‌‌ప్యాక్డ్‌‌ ఈవెంట్‌‌లో ఆ కంపెనీ కొత్తఫోన్‌‌ సామ్‌‌సంగ్ ఎస్ 22 సిరీస్‌‌, ఇంకా ట్యాబ్‌‌ ఎస్‌‌ 8 సిరీస్‌‌లను లాంచ్‌‌ చేసింది. ఇప్పటినుండి సముద్రాల్లో ఉన్న ప్లాస్టిక్‌‌ వేస్ట్‌‌ను బయటికి తీసి వాళ్లు తయారుచేసే మొబైల్స్‌‌, ట్యాబ్స్‌‌లో ఆ ప్లాస్టిక్‌‌ వేస్ట్‌‌ను రీసైకిల్‌‌ చేసి వాడబోతున్నట్టు ప్రకటించింది. వాటి ప్యాకింగ్‌‌కు వాడే బాక్స్‌‌లు కూడా‌‌ రీసైకిల్‌‌ పేపరేనట.  అలా ఇప్పటివరకు 50 టన్నుల ప్లాస్టిక్‌‌ వేస్ట్‌‌ను సముద్రం నుండి బయటికి తీసారట.సెగ్రిగేటింగ్‌‌, కట్టింగ్‌‌, క్లీనింగ్‌‌, ఎక్స్‌‌ట్రాక్టింగ్‌‌ పద్ధతితో ఆ ప్లాస్టిక్‌‌ను రీసైకిల్‌‌ చేసి వాడతారట. ఆ ఈవెంట్ చివర్న కొరియన్‌‌ పాప్‌‌ సింగింగ్‌‌ బ్యాండ్‌‌ ‘బిటిఎస్‌‌’ ప్లకార్డ్స్‌‌ పట్టుకొని ‘లెట్స్‌‌ వర్క్‌‌ టు గెదర్‌‌‌‌ ఫర్‌‌‌‌ ఎ బెటర్‌‌‌‌ ఫ్యూచర్‌‌’  అని ప్లాస్టిక్‌‌ పైన సోషల్‌‌ అవేర్‌‌‌‌నెస్‌‌ కల్పిస్తున్నారు. ‌‌