ఆగష్టు 15 నుంచి బుచ్చిబాబు టోర్నమెంట్.. బరిలో భారత స్టార్ క్రికెటర్లు

ఆగష్టు 15 నుంచి బుచ్చిబాబు టోర్నమెంట్.. బరిలో భారత స్టార్ క్రికెటర్లు

ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇండియా బుచ్చి బాబు టోర్నమెంట్ ఆగసస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. భారత క్రికెట్ అగ్రగామి, దక్షిణాది భారత క్రికెట్ పితామహుడు ఎం. బుచ్చి బాబు నాయుడు(మోతవరపు వెంకట మహిపతి నాయుడు) పేరు మీద ఈ టోర్నీ నిర్వహిస్తారు. ఆరేళ్ల విరామం తర్వాత జరుగుతోన్న ఈ టోర్నమెంట్‌లో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, సర్ఫరాజ్ ఖాన్ వంటి పలువురు భారత క్రికెటర్లు కనిపించనున్నారు. 

ఈ టోర్నీ షెడ్యూల్ ఏంటి..? పాల్గొనే జట్లు ఎన్ని..? లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలి..? వంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. 

టైటిల్ రేసులో 12 జట్లు..

మొత్తం 12 జట్లు తలపడుతోన్న ఈ టోర్నీని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA) నిర్వహిస్తోంది. పాల్గొంటున్న 12 జట్లను ఒక్కో గ్రూపుకు రెండు జట్లు చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు. తమిళనాడులోని తిరునెల్వేలి, కోయంబత్తూరు, సేలం, నాథమ్ వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి సెమీఫైనల్ కు తిరునెల్వేలిలో జరగనుండగా, రెండో సెమీ-ఫైనల్, గ్రాండ్ ఫినాలేకు నాథమ్‌ ఆతిథ్యమివ్వనుంది. 

రంజీ ట్రోఫీ లీగ్ దశల మాదిరిగానే నాలుగు రోజుల రెడ్-బాల్ ఫార్మాట్‌లో ఈ టోర్నీ జరగనుంది. విజేతగా నిలిచిన జట్టు రూ.3 లక్షలు, రన్నరప్‌గా నిలిచిన జట్టు రూ. 2 లక్షలు ప్రైజ్ మనీ అందుకోనున్నాయి. 

  • గ్రూప్ ఏ: మధ్యప్రదేశ్(డిఫెండింగ్ ఛాంపియన్ ), జార్ఖండ్, హైదరాబాద్
  • గ్రూప్ బి: రైల్వేస్, గుజరాత్, TNCA ప్రెసిడెంట్స్ XI
  • గ్రూప్ సి: ముంబై, హర్యానా, TNCA XI
  • గ్రూప్ డి: జమ్మూ & కాశ్మీర్, బరోడా, ఛత్తీస్‌గఢ్‌

టోర్నమెంట్ షెడ్యూల్:

  • ఆగస్టు 15-18: మధ్యప్రదేశ్ vs జార్ఖండ్ (తిరునెల్వేలి)
  • ఆగస్టు 15-18: రైల్వేస్ vs గుజరాత్ (సేలం)
  • ఆగస్టు 15-18: ముంబై vs హర్యానా (కోయంబత్తూరు)
  • ఆగస్టు 15-18: జమ్మూ కాశ్మీర్ vs ఛత్తీస్‌గఢ్ (నాథమ్)
  • ఆగస్టు 21-24: జార్ఖండ్ vs హైదరాబాద్ (తిరునెల్వేలి)
  • ఆగస్టు 21-24: రైల్వేస్ vs TNCA ప్రెసిడెంట్స్ XI (సేలం)
  • ఆగస్టు 21-24: హర్యానా vs TNCA XI    (కోయంబత్తూరు)
  • ఆగస్టు 21-24: జమ్మూ కాశ్మీర్ vs బరోడా (నాథమ్)
  • ఆగస్టు 27-30: మధ్యప్రదేశ్ vs హైదరాబాద్ (తిరునెల్వేలి)
  • ఆగస్టు 27-30: గుజరాత్ vs TNCA ప్రెసిడెంట్స్ XI (సేలం)
  • ఆగస్టు 27-30: TNCA XI vs ముంబై    కోయంబత్తూరు
  • ఆగస్టు 27-30: బరోడా vs ఛత్తీస్‌గఢ్ (నాథమ్)
  • సెప్టెంబర్ 02-05: మొదటి సెమీ-ఫైనల్:  గ్రూప్ ఏ టాపర్ vs గ్రూప్ బి టాపర్ (తిరునెల్వేలి)
  • సెప్టెంబర్ 02-05: రెండో సెమీ-ఫైనల్: గ్రూప్ సి టాపర్ vs గ్రూప్ డి టాపర్ (నాథమ్)
  • సెప్టెంబర్ 08-11: ఫైనల్: మొదటి సెమీ-ఫైనల్ విన్నర్ vs రెండో సెమీ-ఫైనల్ విన్నర్ (నాథమ్)

లైవ్ స్ట్రీమింగ్ వివరాలు: 

తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ యాప్‌(TNCA యాప్‌)లో అన్ని మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి. టీవీ లేదా మరే ఇతర స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రత్యక్ష ప్రసారాలు లేవు.