దర్శకుడు బుచ్చిబాబుకు రామ్ చరణ్, ఉపాసన ప్రత్యేక బహుమతి.. ఎంతో ఆధ్యాత్మిక అర్థం!

దర్శకుడు బుచ్చిబాబుకు రామ్ చరణ్, ఉపాసన ప్రత్యేక బహుమతి.. ఎంతో ఆధ్యాత్మిక అర్థం!

రామ్ చరణ్- బుచ్చి బాబు తొలిసారి జతకట్టిన చిత్రం పెద్ది (PEDDI). రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఇది రూపొందుతుంది. ఇటీవలే, మార్చి 27న  రామ్ చరణ్ తన 40వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చరణ్, ఉపాసన కలిసి దర్శకుడు బుచ్చిబాబు సానాకు ఒక ఆలోచనాత్మకమైన బహుమతి పంపారు.

ఆ గిఫ్ట్ సెట్‌లో 'శ్రీరాముడి పాదుకలు, హనుమాన్‌ చాలీసా పుస్తకం, చేతితో చిత్రించిన హనుమంతుడి ప్రతిమ ఉన్నాయి. అంతేకాకుండా ట్రావెల్ కిట్ సైతం గిఫ్ట్‌గా పంపారు. ఇందులో తెలంగాణకు చెందిన కళాకారులు చేతితో చిత్రించిన చెరియాల్ హనుమాన్ ముసుగు, ప్రశంసా పత్రం కిట్లో భాగంగా ఉన్నాయి.

'నా మనసులో నీకెప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆ హనుమంతుడి ఆశీస్సులు నీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను’ అని రాసి ఉన్న నోట్‌, శ్రీరాముని పాదుకలను రామ్ చరణ్ పంపారు.

అయితే, ఇవన్నీ బుచ్చిబాబుకు తనబలాన్నిపెంపొందించుకునేలా స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. చరణ్‌ దంపతులు పంపిన ఈ విలువైన బహుమతులని నేడు (ఏప్రిల్ 4న) దర్శకుడు బుచ్చిబాబు X వేదికగా షేర్ చేశారు. 

►ALSO READ | కళ్యాణ్ రామ్ యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.?

"మీ (రామ్ చరణ్, ఉపాసన) ప్రేమ మరియు మద్దతుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. హనుమంతుని ఆశీస్సులు మీకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ విలువలు నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. మీ అద్భుతమైన బహుమతికి ధన్యవాదాలు" అని బుచ్చిబాబు X లో రామ్ చరణ్‌, ఉపాసనను ట్యాగ్‌ చేస్తూ పోస్ట్‌పెట్టారు.

ప్రస్తుతం, బుచ్చిబాబు షేర్ చేసిన ఫోటోలు మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. ఒక దర్శకుడికి చరణ్ ఇచ్చే గౌరవ, మర్యాదులు ఎంతో ప్రేరణని ఇచ్చేలా ఉన్నాయంటూ పోస్టులు పెడుతున్నారు.

ఇటీవలే రిలీజ్ చేసిన పెద్ది రెండు పోస్టర్స్ సినిమా బ్యాక్‌డ్రాప్‌ను తెలియజేస్తున్నాయి. అందులో ఒక పోస్టర్లో రామ్ చరణ్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. ముక్కుకు పోగు, లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో ఆకట్టుకుంటున్నాడు.

మ‌రో పోస్ట‌ర్‌లో జాత‌ర సెట్‌, విలేజ్ నేటివిటీ, చేతిలో క్రికెట్ బ్యాట్ ప‌ట్టుకొని సీరియ‌స్‌ లుక్‌లో చరణ్ కొత్త అవతారంలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్స్ మెగా అభిమానులను వీపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఏప్రిల్ 6న వచ్చే పెద్ది గ్లింప్స్ తో మరిన్ని అంచనాలు పెరిగే అవకాశం ఉంది.