అధికార పార్టీ డబ్బులు వెదజల్లుతోంది: బుడగం శ్రీనివాసరావు 

భద్రాచలం, వెలుగు :  బీఆర్​ఎస్​ పార్టీ భద్రాచలం అభ్యర్థి తెల్లం వెంకట్రావు డబ్బులు వెదజల్లుతూ ఓట్లు కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ మెంబర్​ బుడగం శ్రీనివాసరావు ఆరోపించారు. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలో తనను వ్యతిరేకిస్తున్న వారికి తెల్లం వెంకట్రావు డబ్బులు పంచుతున్నారని, ఇది ఎన్నికల సంఘం అధికారులకు కనిపించక పోవడం శోచనీయం అన్నారు.

కేసీఆర్​ మొదటిసారి గద్దెనెక్కి రామాలయం అభివృద్ధికి రూ.100కోట్లు ఇస్తానని ఇవ్వలే, రెండోసారి గద్దెనెక్కినప్పుడు వరదల నివారణకు శాశ్వత పరిష్కారానికి రూ.1000కోట్లు ఇస్తానని ఇవ్వాలేదని విమర్శించారు. ఈ ప్రాంత ప్రజలను మోసం చేసిన కేసీఆర్​కు ఇక్కడి ఓట్లు అడిగే హక్కులేదన్నారు. పార్టీ మండల అధ్యక్షులు నరేశ్, సీనియర్​నాయకులు బోగాల శ్రీనివాసరెడ్డి, అడబాల వెంకటేశ్వరరావు, బలుసు నాగ సతీశ్, రమేశ్ ​పాల్గొన్నారు.