హాలియా, వెలుగు : నాగార్జునసాగర్ లో నిర్మించిన బుద్ధవనం అద్భుత బౌద్ధ వారసత్వ ప్రదర్శనశాల అని అంతర్జాతీయ హార్ట్ ఫుల్ నెస్ మార్గదర్శి దాజి కమలేశ్ పటేల్ అన్నారు. శుక్రవారం నాగార్జునసాగర్బుద్ధవనాన్ని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.ప్రకాశ్ రెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా బుద్ధవనంలోని మహాస్తూపం లోపల బుద్ధుని పరమపవిత్రమైన దాతుపేటికలు, బౌద్ధాలయాన్ని పరిశీలించారు.
బుద్ధవనంలోని ప్రధాన ఆకర్షణలైన బుద్ధ చరితవనం, జాతకవనం, ధ్యానవనం, 27 అడుగుల శ్రీలంక అవకన బుద్ధప్రతిమ, స్తూపవనాల అంశాలపై ఆయనకు బుద్ధిష్ట్ ఎక్స్ఫర్ట్కన్సల్టెంట్ డాక్టర్ శివనాగిరెడ్డి వివరించారు. వారి వెంట జెన్కో సీఎండీ రోనాల్డ్ రోస్ , ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ విశాలాక్షి, మాజీ నీటివనరుల సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్, బయో జెన్ కేర్ డైరెక్టర్ పార్థసారథి, బుద్ధవనం అధికారి సుధన్ రెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, డిజైన్ ఇన్చార్జి శ్యాంసుందర్రావు తదితరులు ఉన్నారు.