- మంత్రి పదవిపై రాజగోపాల్‌రెడ్డి ఆశలు
- ఎమ్మెల్యే టికెట్ ఆశించినవారికి..
- కమ్యూనిస్టులకూ నామినేటెడ్పోస్టుల్లో ప్రయార్టీ
- బీసీ, ఎస్సీ, ఎస్టీలకే ప్రాధాన్యత
నల్గొండ, వెలుగు : నామినేటెడ్పదవులపై జిల్లా నేతలు పెట్టుకున్నారు. పార్లమెంట్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలు ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. దీంతో ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డ ముఖ్యనేతలు, ఎమ్మెల్యే టికెట్ఆశించినవారికి నామినేటెడ్ పోస్టుల్లో ప్రయార్టీ లభించనుంది. త్వరలో పీసీసీ పదవితోపాటు కేబినెట్ లో మార్పులు ఉంటాయని సీఎం రేవంత్సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మంత్రి పదవిపైనా అటు నామినేటెడ్ పదవులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
భువనగిరి పార్లమెంట్స్థానానికి ఇన్చార్జిగా వ్యవహరించిన రాజగోపాల్‌రెడ్డికి ఈదఫా కేబినెట్లో బెర్త్‌పై ఆశలు పెట్టుకున్నారు. చామల కిరణ్ కుమార్‌రెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించిన రాజగోపాల్‌రెడ్డికి అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని ఆయన వర్గీయులు చెబుతున్నారు. అదే విధంగా పార్టీలో ఇన్నాళ్లు కష్టపడ్ట లీడర్లు, కమ్యూనిస్టులకూ నామినేటెడ్పోస్టుల్లో అవకాశం కల్పిస్తారని అంటున్నారు. నామినేటెడ్పోస్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకే ప్రాధాన్యత ఉంటుందని ఆ పార్టీ సీనియర్లు ఆశావహులకు సంకేతాలు ఇస్తున్నారు.
ఇప్పటికే సూర్యాపేట జిల్లాకు నా మినెటెడ్ పోస్టుల్లో మొదటి ప్రయార్టీ ఇచ్చారు. పేటకు చెందిన పటేల్రమేశ్ రెడ్డిని టూరిజం కార్పొరేషన్చైర్మన్గా భర్తీ చేశారు. కాబట్టి నెక్ట్స్లిస్ట్లో నల్గొండ, యాదాద్రి జిల్లాలకే ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది.
మంత్రి కోమటిరెడ్డి, జానారెడ్డి కోటాలో ఎవరికి..
జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సన్నిహితుడు నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డికి రాష్ట్ర స్థాయి పదవి ఇస్తామని పార్లమెంట్ఎన్నికల టైంలో హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ మైనార్టీలు కాంగ్రెస్ వైపే మొగ్గుచూపారు. కాబట్టి ఆ వర్గానికి రాష్ట్ర స్థాయిలో లేదంటే జిల్లాలో కీలక పదవి ఇస్తారనే టాక్వినిపిస్తోంది. ఇక జానారెడ్డి కోటాలో నకిరేకల్ ఎమ్మెల్యే టికెట్ఆశించిన కొండేటి మల్లయ్య ముందు వరుసలో ఉన్నారు. గత రెండు టర్మ్‌ల నుంచి మల్లయ్య నకిరేకల్టికెట్ఆశించి భంగపడ్డారు.
నకిరేకల్‌నుంచి గతంలో వేముల వీరేశం సన్నిహితుడు పూజర్ల శంభయ్య గతంలో బీసీ కార్పొరేషన్చైర్మన్గా పనిచేశారు. వీరేశంతోపాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన శంభయ్య నామినేటెడ్ రేసులో ఉన్నారు. గౌడ, పద్మశాలి, ముదిరాజ్సామాజికవర్గాలు బలంగా ఉన్న జిల్లాల్లో ఎలాంటి పదవి దక్కలేదు. కావున నామినేటెడ్పోస్టుల్లో ఈ వర్గానికి కూడా సముచిత స్థానం కల్పిస్తారని చెబుతున్నారు.
ఉమ్మడి జిల్లాల్లో మరిన్ని నామినేటెడ్ పోస్టులు..
నాగార్జునసాగర్ఎడమ కాల్వ చైర్మన్‌గా గతంలో కోదాడకు చెందిన లక్ష్మీనారాయణరెడ్డి పనిచేశారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖలో డైరెక్టర్ గా హుజూర్‌నగర్‌కు చెందిన శివారెడ్డికి గతంలో చోటు దక్కింది. ఉమ్మడి జిల్లాలో డీసీసీబీ చైర్మన్, వైస్చైర్మన్పదవులు కోదాడ లీడర్లకే దక్కాయి. ఈ రెండు నియోజవర్గాల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీ సాధించినందున నామినేటెడ్‌పోస్టులు ఆశిస్తున్నారు. ఎస్టీ కోటాలో నల్గొండ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నాయక్ ను కార్పొరేషన్ చైర్మన్‌గా నియమిస్తారా.. లేదంటే నల్గొండ జడ్పీ చైర్మ న్గా అవకాశం కల్పిస్తారన్నది వేచిచూడాల్సిందే.
డీసీసీబీ, మదర్‌డెయిరీ చైర్మన్లకు ఎసరు..!
త్వరలో నల్గొండ డీసీసీబీ చైర్మన్ మహేందర్‌రెడ్డిపై అవిశ్వాస తీర్మా నం పెట్టేందుకు రాజగోపాల్ రెడ్డి వర్గం పావులు కదుపుతోంది. మునుగోడు పీఏసీఎస్ చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి చైర్మన్అ య్యేందుకు డైరెక్టర్లతో మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో టెస్కాబ్వైస్ చైర్మన్ పదవికి మహేందర్‌రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మహేందర్ రెడ్డి శిష్యుడు, ప్రస్తుతం మదర్‌డెయిరీ చైర్మన్‌గా ఉన్న శ్రీకర్ రెడ్డిని సైతం పదవి నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సోదరుడు మాజీ మదర్‌డెయిరీ చైర్మన్‌గుత్తా జితేందర్‌రెడ్డి డెయిరీ చైర్మన్ పదవి ఆశిస్తున్నారు.