
హైదరాబాద్, వెలుగు: వరల్డ్ క్యాడెట్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బుడ్డోడు దివిత్ రెడ్డి అదరగొట్టాడు. అల్బేనియాలో జరిగిన ఈ టోర్నీ అండర్–8 కేటగిరీ ర్యాపిడ్‌లో గోల్డ్, బ్లిట్జ్‌లో బ్రాంజ్ మెడల్స్ కైవసం చేసుకున్నాడు. అండర్8 ఓపెన్ ర్యాపిడ్ విభాగంలో దివిత్ 11 గేమ్‌ల్లో పదింటిలో గెలిచి ఒక దాంట్లో ఓడిపోయాడు. మొత్తం 10 పాయింట్లతో టాప్ ప్లేస్ సాధించి చాంపియన్‌గా నిలిచాడు. బ్లిట్జ్‌లో ఎనిమిది విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రాతో 8.5 పాయింట్లతో మూడో స్థానంతో బ్రాంజ్ మెడల్ గెలిచాడు.