బడ్జెట్ 2024 : మౌలిక వసతులకు బూస్టింగ్.. ఏకంగా 11 లక్షల కోట్లు కేటాయింపు

కేంద్ర బడ్జెట్ లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేసింది. ఏకంగా 11 లక్షల కోట్లు నిధులు కేటాయించింది. జీడీపీలో ఇది 3.4 శాతం వాటా కావటం విశేషం.

మౌలిక వసతుల కేటగిరీ కింద రోడ్ల నిర్మాణం, నిర్వహణ, ప్రభుత్వ భవనాల నిర్మాణం, ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో వసతులు కల్పించటం, పారిశుధ్యం మెరుగుపరచటం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి కావాల్సిన వసతులు కల్పించటం, ఇంధన రంగాలను పటిష్ఠం చేసే చర్యలు తీసుకోవటం, పెట్టుబడిదారులకు అవసరం అయిన రోడ్లు, కరెంట్, నీళ్లు వంటి సౌకర్యాలను కల్పించటం, విమానాశ్రయాలు, పోర్టుల దగ్గర మౌలిక వసతుల కల్పన వంటివి అన్నీ మౌలిక వసతుల కల్పన కిందకు వస్తాయి. 

ALSO READ : బడ్జెట్ 2024: ముద్ర లోన్ రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు

ఈ రంగానికి అత్యధికంగా 11 లక్షల 11 వేల కోట్లు కేటాయించటం ద్వారా.. స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించినట్లు అవుతుందని ఆర్థిక మంత్రి వెల్లడించారు. దీని ద్వారా రియల్ ఎస్టేట్ రంగానికి కూడా బూస్టింగ్ ఇచ్చినట్లు అవుతుంది.