బడ్జెట్ లో పర్యావరణానికి రూ.3,330 కోట్లు

బడ్జెట్ లో పర్యావరణానికి రూ.3,330 కోట్లు

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్​లో అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖకు కేంద్రం  రూ. 3,330.37 కోట్లు కేటాయించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్యాపిటల్ ఎంటర్‌‌‌‌ ప్రెన్యూర్‌‌‌‌షిప్ సంబంధిత సంస్కరణల కింద వాతావరణ ఫైనాన్స్ వర్గీకరణ గురించి ప్రస్తావించారు. దేశంలో వాతావరణ అనుకూలత పెంపొందించడానికి తాము క్లైమేట్​ ఫైనాన్స్ వర్గీకరణను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇది దేశ వాతావరణ పరిరక్షణ, హరిత వృద్ధి సాధించడానికి తోడ్పడుతుంది అని ఆమె చెప్పారు. 

ALSO READ : పటాన్ చెరు – దిల్ సుఖ్​నగర్​ రూట్ లో 10 ఏసీ మెట్రో లగ్జరీ బస్సులు

 

కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌‌‌‌లో పర్యావరణమంత్రిత్వ శాఖకు రూ. 3,265.53 కేటాయించగా, గత బడ్జెట్​లో కేంద్రం పర్యావరణ శాఖకు రూ.3,079.40 కోట్లు కేటాయించింది. అదేవిధంగా కాలుష్య నియంత్రణకు కేంద్రం రూ.858.5 కోట్లు కేటాయించగా, గత ఆర్థిక సంవత్సరంలో దీని కోసం రూ.756 కోట్లు అలాట్​ చేసింది. గ్రీన్ ఇండియా నేషనల్ మిషన్‌‌‌‌కు రూ.220 కోట్లు కేటాయించారు. సవరించిన బడ్జెట్ ప్రకారం గత ఏడాదికి ఇది రూ.160 కోట్లు ఉండగా ఈ బడ్జెట్​లో మరో రూ.60 కోట్లు అదనంగా కేటాయించారు.