బడ్జెట్ 2024: ముద్ర లోన్ రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు

లోక్‌సభలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మలా మాట్లాడుతున్నారు. ఆమె మాట్లాడుతూ.. ముద్ర లోన్ పరిమితిని భారీగా పెంచామన్నారు. ఇప్పటివరకు ఆ స్కీమ్ కింద రూ.10 లక్షల లోన్ ఇస్తుండగా దాన్ని రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. వాణిజ్య బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు సైతం ఈ లోన్స్ అందిస్తాయని తెలిపారు.

ALSO READ : బడ్జెట్ 2024: కొత్త ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్