కేంద్ర బడ్జెట్‌‌‌‌ ఇచ్చిన  పన్ను ప్రయోజనాలు ఇవే

  •     ఇండెక్సేషన్ బెనిఫిట్స్ తీసేసినా.. గోల్డ్‌‌‌‌, ప్రాపర్టీ అమ్మకాలపై తగ్గిన క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌‌‌‌
  •     ఏంజెల్ ట్యాక్స్ రద్దుతో స్టార్టప్‌‌‌‌లకు మేలు 

న్యూఢిల్లీ : కేంద్రం  బడ్జెట్‌‌‌‌లో  ఈక్విటీలపై లాంగ్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్‌‌‌‌టీసీజీ) ట్యాక్స్‌‌‌‌ ను పెంచడంతో పాటు  ప్రాపర్టీ, గోల్డ్ సేల్స్‌‌‌‌పై ఇండెక్సేషన్‌‌‌‌  (ఇన్‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌ను పరిగణనలోకి తీసుకుని ధర నిర్ణయించడం) తొలగించింది. అయినప్పటికీ  ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ట్యాక్స్ పేయర్లకు మేలు చేసే ప్రపోజల్స్‌‌‌‌ను కూడా ప్రకటించారు. అవి ఇలా ఉన్నాయి.

  • కొత్త పన్ను విధానం అందిస్తున్న  స్టాండర్డ్‌‌‌‌ డిడక్షన్‌‌‌‌ను ప్రభుత్వం  రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచింది. అంతేకాకుండా ఇన్‌‌‌‌కమ్ ట్యాక్స్ స్లాబ్‌‌‌‌లను సవరించింది. దీంతో ఉద్యోగులు ఇక నుంచి  ఏడాదికి అదనంగా రూ.17,500 ఆదా చేసుకోవడానికి వీలుంటుంది.
  • పెన్షనర్లు పొందే స్టాండర్డ్ డిడక్షన్‌‌‌‌ను రూ.15 వేల నుంచి రూ.25 వేలకు ప్రభుత్వం పెంచింది. 
  •  స్టార్టప్‌‌‌‌ ఎకోసిస్టమ్‌‌‌‌ను డెవలప్ చేసేందుకు ఏంజెల్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ తొలగించింది. స్టార్టప్‌‌‌‌ ఫౌండర్లు, ఏంజెల్ ఇన్వెస్టర్లకు ఇది మేలు చేస్తుంది. ఎర్లీ స్టేజ్‌‌‌‌ స్టార్టప్‌‌‌‌లలో చేసే ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లను ఏంజెల్ ఇన్వెస్ట్‌‌‌‌మెం ట్స్ అంటారు.
  •  మొబైల్‌‌‌‌ ఫోన్లు, ఛార్జర్లపై కస్టమ్స్ డ్యూటీని 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గించడంతో ఇక నుంచి దిగుమతయ్యే ఫోన్ల ధరలు తగ్గనున్నాయి.  గూగుల్ పిక్సల్‌‌‌‌, ఐఫోన్ ప్రో వంటి దిగుమతి చేసుకుంటున్న హై ఎండ్ ఫోన్ల ధరలు రూ.7 వేల నుంచి రూ. 15 వేల మధ్య తగ్గుతాయని అంచనా. 
  • గోల్డ్‌‌‌‌, సిల్వర్‌‌‌‌‌‌‌‌పై  కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడంతో  వీటి ధరలు భారీగా తగ్గనున్నాయి. కేజీ సిల్వర్ రేటు రూ.7,600, కేజీ బంగారం రేటు రూ.5,900 తగ్గుతుందని అంచనా.
  • లాంగ్ టెర్మ్  క్యాపిటల్ గెయిన్స్ (ఎల్‌‌టీసీజీ), షార్ట్‌‌ టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎస్‌‌టీజీఎస్‌‌) ట్యాక్స్‌‌లను ప్రభుత్వం రేషనలైజ్ చేసింది. షేర్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌‌, రైట్స్, ఇన్విట్స్ వంటి లిస్టెడ్ అసెట్స్‌‌పై వేస్తున్న ఎల్‌‌టీసీజీ  ట్యాక్స్‌‌ను 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచింది. కానీ ఇక నుంచి ఏడాది పాటు హోల్డ్‌‌ చేస్తే ఇవి లాంగ్ టెర్మ్ క్యాపిటల్‌‌ అసెట్స్‌‌గా పరిగణిస్తారు. వీటిపై ఎస్‌‌టీజీఎస్‌‌ ట్యాక్స్‌‌ను 15 శాతం నుంచి 20 శాతానికి పెంచినప్పటికీ, ట్యాక్స్ మినహాయింపును రూ.లక్ష నుంచి  రూ.1.25 లక్షలకు  ప్రభుత్వం పొడిగించింది. 
  • ప్రాపర్టీలు, గోల్డ్‌‌, నాన్ లిస్డెడ్ సెక్యూరిటీలు వంటి అసెట్స్‌‌పై వేసే ఎల్‌‌టీసీజీ ట్యాక్స్‌‌ను 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించారు. కానీ, ఇండెక్సేషన్ బెనిఫిట్స్‌‌ను తొలగించారు. అయినప్పటికీ ఇక నుంచి రెండేళ్ల పాటు హోల్డ్ చేస్తే వీటిని లాంగ్ టెర్మ్ క్యాపిటల్ అసెట్స్‌‌గా పరిగణిస్తారు. గతంలో మూడేళ్ల పాటు హోల్డ్ చేయాల్సి వచ్చేది.  ట్యాక్స్ స్లాబ్ రేట్లకు తగ్గట్టు ఎస్‌‌టీజీఎస్‌‌ ట్యాక్స్ పడుతుంది.
  • రెంట్లు, కమీషన్లపై వేస్తున్న ట్యాక్స్ డిడక్టడ్‌‌‌‌ ఎట్ సోర్స్ (టీడీఎస్‌‌‌‌) ను 5 శాతం నుంచి 2 శాతానికి ప్రభుత్వం తగ్గించింది.
  •  పిల్లల పేరుతో తల్లిదండ్రులు చేసే ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లపై వేసే ట్యాక్స్ కలెక్టడ్‌‌‌‌ ఎట్ సోర్స్ (టీసీఎస్‌‌‌‌) ను  ట్యాక్స్ క్రెడిట్ కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు.
  • రూ.20 లక్షల లోపు విలువున్న ఫారిన్ అసెట్స్‌‌‌‌ను   ట్యాక్స్ పేయర్లు  డిస్‌‌‌‌క్లోజ్ చేయకపోయినా ఇక నుంచి పెనాల్టీ పడదు. 
  •  ఇండియాలో  కంపెనీలు లేకుండా సర్వీస్‌‌‌‌లు అందిస్తున్న డిజిటల్‌‌‌‌ కంపెనీలకు ప్రభుత్వం బడ్జెట్‌‌‌‌లో ఊరటనిచ్చింది. వీటిపై వేస్తున్న 2 శాతం ఈక్విలైజేషన్ లెవీని తొలగించింది. 
  •     మహిళలు ప్రాపర్టీలను కొంటే స్టాంప్ డ్యూటీ రిబేట్స్‌‌‌‌ (రాయితీల)ను ఆఫర్ చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.
  •     అమెజాన్, ఫ్లిప్‌‌‌‌కార్ట్ వంటి ప్లాట్‌‌‌‌ఫామ్స్‌‌‌‌లో 
  • అమ్ముతున్న సెల్లర్ల ట్రాన్సాక్షన్లపై వేసే టీడీఎస్‌‌‌‌ను 1 శాతం నుంచి 0.1 శాతానికి ప్రభుత్వం తగ్గించింది.