తగ్గనున్న మొబైల్ ఫోన్ల ధరలు

తగ్గనున్న మొబైల్ ఫోన్ల ధరలు

మొబైల్ ఫోన్ల ధరలు తగ్గనున్నాయి. దాదాపు 6 శాతం మేర చౌకగా లభ్యం కానున్నాయి. దిగుమతి చేసుకునే ఫోన్లపై కేంద్రం కస్టమ్స్ డ్యూటీని 20 నుంచి 15 శాతానికి తగ్గించింది. బడ్జెట్​లో మొబైల్ ఫోన్స్, ఛార్జర్స్, హ్యాండ్​సెట్​ల తయారీకి ఉపయోగించే కొన్ని కాంపోనెంట్స్​పై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. 

మొబైల్ ఫోన్లు భారీగా అమ్ముడవుతున్నాయని చెప్పారు. గత ఆరేండ్లలో దేశంలో ఫోన్ల ఉత్పత్తి 3 రెట్లు పెరగగా, దిగుమతులు100 రెట్లు పెరిగాయని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై మొబైల్ ఫోన్ల ఇండస్ట్రీ హర్షం వ్యక్తం చేసింది. ఈ రంగానికి మరింత ఊతం చేకూరుతుందని ఇండస్ట్రీ ప్రతినిధులు పేర్కొన్నారు.