బడ్జెట్ 2024: పార్లమెంటులో హల్వా వేడుక ఫోటోలను ప్రదర్శిస్తూ సంచలన కామెంట్స్ చేసిన రాహుల్ గాంధీ

బడ్జెట్ 2024:  పార్లమెంటులో హల్వా వేడుక ఫోటోలను ప్రదర్శిస్తూ సంచలన కామెంట్స్ చేసిన రాహుల్ గాంధీ

సోమవారం పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పై రాహుల్ గాంధీ  నిప్పులు చెరిగారు. 2024 -25బడ్జెట్ సెషన్‌కు ముందు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన హల్వా వేడుకపై కామెంట్స్ చేశారు. ఆర్థిక మంత్రి  నిర్మలా సీతారామన్‌ ఆధ్వర్యంలో జరిగిన  హల్వా వేడుకలో ఓబీసీ, దళిత, గిరిజన అధికారి ఒక్కరు కూడా లేరని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ లో  బడ్జెట్ పై ప్రసంగిస్తూ సాంప్రదాయ హల్వా వేడుక ఫోటోలను ప్రదర్శించారు.

ఆ ఫోటోలో OBC, గిరిజన, దళిత బ్యూరోక్రాట్‌లు ఒక్కరు కూడా లేరని పేర్కొన్నారు. నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన 2024-25 కేంద్ర బడ్జెట్‌లో జనాభాలో 73% ఉన్న ప్రజల ప్రాతినిధ్యం లేదని తెలిపారు. ఈ బడ్జెట్ ను 20 మంది అధికారులు తయారు చేశారని తెలిపారు. ఇది 20  మంది అధికారులు తయారు చేసిన హిందుస్థాన్ హల్వా అని.. 73% ప్రాతినిధ్యం లేని హల్వా అని  రాహుల్ పార్లమెంటులో అన్నారు.

ALSO READ | బీజేపీ చక్రవ్యూహంలో జనం.. అప్పుడూ.. ఇప్పుడూ ఆరుగురే: రాహుల్ గాంధీ పంచ్ లు