
కేంద్ర బడ్జెట్లో ఏపీ, బిహార్‌కు మాత్రమే ఎక్కువ నిధులు కేటాయించటంపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి. ‘ఇది దేశ బడ్జెటా లేక బిహార్, ఆంధ్రప్రదేశ్ బడ్జెటా?’ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏపీ, బిహార్‌కు మాత్రమే నిధులు కేటాయించి మిగతా రాష్ట్రాలను ఎందుకు పట్టించుకోలేదని నిలదీస్తున్నారు.
తూర్పు రాష్ట్రాల అభివృద్ధికి పూర్వోదయ
తూర్పు రాష్ట్రాల అభివృద్ధిపై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఆ రాష్ట్రాల డెవలప్ మెంట్ కోసం ‘పూర్వోదయ’ పేరుతో ప్రత్యేక ప్రణాళికను రూపొందించ నున్నట్టు బడ్జెట్లో ప్రకటించింది. దీన్ని తూర్పు రాష్ట్రాలైన బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాతో పాటు ఏపీలోనూ అమలు చేయనున్నట్టు వెల్లడించింది. తూర్పు ప్రాంతంలోని రాష్ట్రాలు గొప్ప సంస్కృతీ సంప్రదాయాలకు నెలవు అని, ఆ రాష్ట్రాల అభివృద్ధికి ‘పూర్వోదయ’ ప్రణాళిక రూపొందిస్తామని నిర్మల తెలిపారు.