కేంద్ర బడ్జెట్ 2024 సింపుల్ గా చెప్పాలంటే ఉద్యోగాల కల్పన, రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇదే క్రమంలో పెట్టుబడిదారులను టచ్ చేసింది. 10 పాయింట్లలో బడ్జెట్ గురించి చెప్పాలంటే.. ఇలా ఉంది.
>>> బీహార్, ఏపీకి ప్రత్యేక నిధుల కేటాయింపులు భారీగా పెంచింది.
>>> ఉద్యోగ కల్పనకు పలు రకాల స్కీమ్స్ తీసుకొచ్చింది. ఉద్యోగ, ఉపాధికి ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతులు, గృహ నిర్మాణాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది.
>>> పెట్టుబడిదారులకు ప్రయార్టీ ఇస్తూ.. ప్రైవేట్ రంగంపై ఫోకస్ చేసింది బడ్జెట్.
>>> చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవటానికి రుణాల మంజూరును సరళతరం చేసింది. దీని వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అంచనా వేసింది.
>>> కస్టమ్స్ డ్యూటీ తగ్గింపుతో మొబైల్ ఫోన్లు, బంగారం, వెండి, క్యాన్సర్ ట్రీట్ మెంట్ మెడిసిన్స్, వైద్య రంగంలో ఉపయోగించే పరికరాల ధరలను తగ్గించింది.
>>> ఏంజిల్ ట్యాక్స్ రద్దుతో.. స్టార్ట్ అప్ కంపెనీలకు బూస్టింగ్ ఇచ్చింది బడ్జెట్.
>>> దీర్ఘకాలిక, స్వల్పకాలిన పెట్టుబడులపై వచ్చే లాభాలపై పన్నులను పెంచింది కేంద్రం.
>>> ఆదాయంపై పన్ను స్టాండర్డ్ డిడక్షన్ ను 75 వేల రూపాయలకు పెంపు.
>>> ఉద్యోగుల ఆదాయ పన్ను స్లాబుల్లో కొత్త విధానం తీసుకొచ్చింది కేంద్రం. దీని వల్ల ఉద్యోగులకు 7 వేల 500 రూపాయల వరకు ఆదా.
>>> ఇన్ కం ట్యాక్స్ యాక్ట్ 1961 చట్టానికి సవరణలు చేసింది.
మొత్తంగా బడ్జెట్ లో సామాన్యుడిపై ఎఫెక్ట్ అయ్యే 10 కీలక అంశాలు ఇవే. మిగతాది అంతా యథాతథం.. మామూలుగానే ఉందనేది ఆర్థిక నిపుణులు చెబుతున్న మాట..