క్రీడలకు పెరిగిన బడ్జెట్‌‌

క్రీడలకు పెరిగిన బడ్జెట్‌‌

న్యూఢిల్లీ : కేంద్రం ప్రభుత్వం 2025–26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌లో క్రీడలకు రూ. 3,797 కోట్లు కేటాయించింది. గతేడాది కంటే ఇది రూ. 351.98 కోట్లు ఎక్కువ. తాజా బడ్జెట్‌‌లో ప్రభుత్వ కార్యక్రమం అయిన ఖేలో ఇండియాకు అత్యధికంగా వెయ్యి కోట్లను  కేటాయించింది. గతేడాది కంటే 200 కోట్లు పెంచింది. నేషనల్ స్పోర్ట్స్‌‌ ఫెడరేషన్లకు ఇచ్చే ఆర్థిక సహకారం కూడా 340 నుంచి రూ. 400 కోట్లకు పెరిగింది.