Union Budget 2025: ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే..

Union Budget 2025: ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే..

శనివారం ( ఫిబ్రవరి 1, 2025 ) లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మోడీ 3.0లో ఇదే తొలి పూర్తి స్థాయి బడ్జెట్.గురజాడ పద్యం " దేశమంటే మట్టి కాదోయ్ " తో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు నిర్మల సీతారామన్. ఎన్డీయే కేంద్రంలో  మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్ ప్రవేశ పెడుతోంది.  సభలో విపక్షాలు ఆందోళన చేస్తుండగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టారు. కేంద్రం తీరుకు నిరసనగా విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. విపక్షాలు లేకుండానే బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు మంత్రి నిర్మలా సీతారామన్.

ఈ క్రమంలో కేంద్ర బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన పన్ను మినహాయింపులు, ఎగుమతి, దిగుమతులపై సుంకాల మార్పులు పలు వస్తువుల ధరలపై ప్రభావం చూపనున్నాయి. ఈ నేపథ్యంలో పలు వస్తువుల ధరలు పెరుగనుండగా మరికొన్ని తగ్గుతాయి.

ALSO READ : Union Budget 2025: బడ్జెట్ కీలక కేటాయింపులు ఇవే..

వేటి ధరలు పెరుగుతాయి, వేటి ధరలు తగ్గుతాయి ఇప్పుడు తెలుసుకుందాం:

ధరలు తగ్గేవి:

  • క్యాన్సర్ మందులు
  • ప్రాణాలను రక్షించే మందులు
  • ఫ్రోజెన్ చేపలు
  • చేపల పేస్ట్
  • వెట్ బ్లూ లెదర్
  • క్యారియర్-గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్‌లు
  • 12 కీలకమైన ఖనిజాలు
  • ఓపెన్ సెల్
  • LCD, LED టీవీలు
  • భారతదేశంలో తయారైన దుస్తులు
  • మొబైల్ ఫోన్లు
  • తోలు వస్తువులు
  • వైద్య పరికరాలు


ధరలు పెరిగేవి:

  • ఫ్లాట్ ప్యానెల్ డిస్ ప్లే
  • సిగరెట్లు