ట్యాక్స్ పేయర్లకు శుభవార్త అందుతోంది. ప్రస్తుతం రూ.7 లక్షలుగా ఉన్న ఆదాయ పన్ను రహిత పరిమితిని.. కేంద్ర ఆర్థిక శాఖ రూ. 10 లక్షలకు పెంచనుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకు కారణం.. RSS అనుబంధ సంస్థలు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చలు జరపటమే.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనుంది. అంతకుముందు RSS అనుబంధ సంస్థలు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ముందస్తు బడ్జెట్ చర్చల సందర్భంగా వివిధ ప్రతిపాదనలను సమర్పించాయని సమాచారం. వీటిలో పన్ను రహిత/పన్ను మినహాయింపు ఆదాయ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచడం, వ్యవసాయ నిర్దిష్ట ప్యాకేజీని అమలు చేయడం, ఉపాధిహామీ(MGNREGA) పని దినాలను 200కు పెంచడం వంటివి ప్రధానంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఉపాధిహామీ పని దినాలు 200కు పెంపు..!
పవన్ కుమార్ నేతృత్వంలోని భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) ప్రతినిధులు సోమవారం(జనవరి 06) సీతారామన్‌కు తమ సిఫార్సులు అందజేశారు. ప్రస్తుతమున్న ఏడాదికి 100 రోజుల ఉపాధిహామీ పని దినాలను.. 200కు పొడిగించాలని BMS సూచించినట్లు తెలుస్తోంది. అదనంగా వ్యవసాయం, తోటల పెంపకం, బీడీ, మత్స్య పరిశ్రమలతో సహా ఎక్కువ సంఖ్యలో కార్మికులు అవసరమయ్యే రంగాలకు ప్రత్యేక ప్యాకేజీని అభ్యర్థించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీటితో పాటు 8వ వేతన సంఘం అమలు, రూ. 10 లక్షల వరకు పన్ను మినహాయింపు, NPS..UPS కంటే OPSకి ప్రాధాన్యత ఇవ్వాలని సంస్థ కోరినట్లు సమాచారం.
మరి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్తుందా...! లేదా అనేది తేలాల్సి ఉంది. అసలే అడ్డగోలు బాదుడుతో మధ్యతరగతి ప్రజలు ఆమెపై గుర్రుగా ఉన్నారు.
ALSO READ | సాఫ్ట్వేర్ ఉద్యోగులకు చల్లటి కబురు.. HCL ఉద్యోగులు పండగ చేస్కోండి..