మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా ఉద్యోగులకు రిలీఫ్ ఇచ్చింది. సామాన్యులు (ఇండివిజ్యువల్ ట్యాక్స్ పేయర్స్) ఇక నుంచి రూ.12 లక్షల ఆదాయం వరకు ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ కింద ఇస్తున్న రూ.75 వేలు కూడా కలుపుకుంటే రూ. 12 లక్షల 75 వేల ఆదాయం వరకు ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ట్యాక్స్ స్లాబ్స్‌లో కూడా మార్పులు తీసుకువచ్చారు. కొత్త పన్ను విధానంలో ఇస్తున్న రూ.25 వేల ట్యాక్స్ రిబేట్ (రిఫండ్) ను రూ.60 వేలకు పెంచారు. గతంలో రూ.12 లక్షల ఆదాయంపై రూ.80 వేల వరకు పన్ను పడేది. రూ.12 లక్షల కంటే ఎక్కువ ఆదాయం పొందే వారికి కూడా తాజా బడ్జెట్‌లో ఉపశమనం దొరికింది. రూ.16 లక్షల ఆదాయంపై ట్యాక్స్ భారం రూ.50 వేలు తగ్గగా.. రూ.20 లక్షల ఆదాయంపై రూ.90 వేలు.. రూ.24 లక్షల ఆదాయంపై రూ.1,10,000 తగ్గింది. కొత్త పన్ను విధానాన్ని ఎన్నుకున్నవారికే ఈ ట్యాక్స్ ప్రయోజనాలు దక్కుతాయి.
ధరలు తగ్గేవి ..
క్యాన్సర్, ఇతర వ్యాధుల మందులు
ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్
ఇంపోర్టెడ్ కార్లు, బైక్స్
మొబైల్ ఫోన్లు, హెడ్ ఫోన్స్
ఎల్‌సీడీ, ఎల్ఈడీ టీవీలు
ఫ్రోజెన్ చేపలు, చేపల పేస్ట్,సముద్ర ఉత్పత్తులు
లెదర్ ఉత్పత్తులు
ధరలు పెరిగేవి..
స్మార్ట్ మీటర్లు, సోలార్ సెల్స్
ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేలు (టీవీలు)
ఉలెన్ దుస్తులు, ఇంపోర్టెడ్ చెప్పులు
పీవీసీ (పాలీవినైల్ క్లోరైడ్) ఉత్పత్తులు