బడ్జెట్ 2025: భారీగా పెరిగిన ఇన్సూరెన్స్ కంపెనీలషేర్ల ధరలు

బడ్జెట్ 2025: భారీగా పెరిగిన ఇన్సూరెన్స్ కంపెనీలషేర్ల ధరలు

ఇన్సూరెన్స్ కంపెనీల్లో వీదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(FDI)ని అనుమతించడంతో స్టాక్ మార్కెట్లో జీవిత బీమా కంపెనీల హడావుడి మొదలైంది.  శనివారం ( ఫిబ్రవరి 1) ఇన్సూరెన్స్ కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి. బీమా సంస్థలకు 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డిఐ) ప్రతిపాదన బీఎస్ ఈ ఇంట్రా-డే ట్రేడ్‌లో జీవిత బీమా కంపెనీల షేర్లు7 శాతం వరకు పెరిగాయి.
 
స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి),నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇంట్రాలో 7 శాతం వరకు ర్యాలీ చేశాయి. - BSE సెన్సెక్స్‌లో 0.23 శాతం క్షీణతతో పోలిస్తే ఈ స్టాక్‌లు 1 శాతం నుండి 4 శాతం వరకు ఎక్కువగా ట్రేడ్ అయ్యాయి.

బీమారంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై కీలక ప్రకటన చేశారు. ఇన్సూరెన్స్ సెక్టార్ లో FDI లిమిట్స్ ను 74 శాతం నుంచి 100 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు.దీనికి విదేశీ ఇన్వెస్టర్లు బీమా రంగంలో మొత్తం ప్రీమియం ఇన్వెస్ట్ చేయొచ్చు. నవంబర్‌లో  బీమా కంపెనీల్లో ఎఫ్‌డీఐ పరిమితిని 74 శాతం నుంచి 100 శాతానికి పెంచడంతో సహా బీమా రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు చేసింది.