2022-23బడ్జెట్లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలుగు రాష్ట్రాలకు రూ.974కోట్లు కేటాయించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రూ.56 కోట్లు, హైదరాబాద్లోని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ఆఫ్ ఎక్స్ ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ కు రూ.374.35 కోట్లు, హైదరాబాద్ ఐఐటీకి రూ.300కోట్ల చొప్పున నిధులు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలకు రూ.44 కోట్లు సమకూర్చనున్నట్లు చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్లో విశాఖ పెట్రోల్ యూనివర్సిటీకి రూ.150 కోట్లు, ఏపీ సెంట్రల్ యూనివర్సిటీకి రూ.50 కోట్లు చొప్పున నిధులు కేటాయించారు.
మరిన్ని వార్తల కోసం..