బడ్జెట్​లో దివ్యాంగులు ఎక్కడ..?

బడ్జెట్​లో దివ్యాంగులు ఎక్కడ..?

డెవలప్​మెంట్ సొసైటీ ఫర్ ది డెఫ్

ముషీరాబాద్, వెలుగు: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్​లో దివ్యాంగులను పూర్తిగా విస్మరించారని డెవలప్​మెంట్ సొసైటీ ఫర్ ది డెఫ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బడ్జెట్​పై ఆ సోసైటీ జాతీయ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్, కో కన్వీనర్ భారతి, వెంకటేష్ గౌడ్ మంగళవారం నల్లకుంటలోని డెఫ్ రాష్ట్ర ఆఫీస్ లో మాట్లాడారు. దివ్యాంగుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం మరోసారి విస్మరించిందని మండిపడ్డారు. 

ఇటీవల ఢిల్లీలోని కేంద్ర దివ్యాంగుల శాఖ అధికారిని కలిసి సమస్యలు వివరించినా బడ్జెట్​లో మార్పు కన్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏండ్ల తరబడి జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న  బీజేపీ ప్రభుత్వానికి దివ్యాంగుల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి లేదని మరోసారి రుజువైందని విమర్శించారు. త్వరలో తమ ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు.