- రాజన్న ఆలయ బడ్జెట్ 185 కోట్లు
- ఎండోమెంట్ కమిషనర్‌కు ఈవో ప్రతిపాదన
వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీరాజ రాజే శ్వర స్వామి దేవస్థానం వార్షిక బడ్జెట్రూ.185 కోట్లుగా అంచనా వేస్తూ ఎండోమెంట్ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపినట్లు ఈవో కృష్ణ ప్రసాద్ సోమవారం వెల్లడించారు. ఆలయ హుండీ కానుకల ద్వారా 30కోట్లు, ప్రసాదాలు, ఇతరత్రా అమ్మకాల ద్వారా 21కోట్లు, గోదాం సర్దుబాటుల ద్వారా 18 కో ట్లు, లీజులు, లైసెన్సుల ద్వారా 13కోట్లు, అన్నదానం విరాళాలు, డిపాజిట్ల ద్వారా 8 కోట్లు, స్వామివారికి ఉన్న డిపాజిట్ల ద్వారా వడ్డీ 5 కోట్ల, రికవరీల ద్వారా 4 కోట్లు, దత్తత దేవాలయాల ద్వారా 3.50 కోట్లు, ధర్మశాలల అద్దెల ద్వారా 3.80 కోట్లు తదితర మా ర్గాల ద్వారా రూ.185 కోట్ల ఆదాయంగా బడ్జెట్ రూ పొందించామని ఈవో వివరించారు. అలాగే ఆర్థిక సంవత్సరంలో ఖర్చులు.. జీత భత్యాలు, పరిపాలన వ్యయం 32.20కోట్లు, ప్రసాదాల తయారీ, ఇతరత్రా కొనుగోలుకు 18కోట్లు, సెంట్రల్ గోదాం సర్దుబాటుకు 18 కోట్లు, నూతన పెట్టుబడులు 8 కోట్లు, దత్తత దేవాలయాలకు 5 కోట్లు, నీటి నిర్వహణ 3,27 కోట్లు, శానిటేషన్ నిర్వహణకు 3కోట్లు, ద్రత సిబ్బందికి చెల్లింపులు 2.80కోట్లు, భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సౌకర్యాలకు 2. 70 కోట్లు అంచనా వేసినట్లు తెలిపారు. దేవాదాయశాఖ కమిషనర్ అనుమతి కోసం బడ్జెట్ ప్రతిపాదనలు పంపినట్లు ఈవో పేర్కొన్నారు. కాగా, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది.