- తెలంగాణ మాలల ఐక్యవేదిక
ముషీరాబాద్,వెలుగు: రాష్ట్రంలో మాలల స్థితిగతులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ. వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించాలని తెలంగాణ మాలల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు బేర బాలకిషన్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య విజ్ఞప్తి చేశారు. శుక్రవారం అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ట్యాంక్ బండ్ పై విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్లను15 శాతం నుంచి 25% పెంచాలని కోరారు. చెరుకు రామచందర్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.