న్యూఢిల్లీ: మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈ) లకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చారు. ఎటువంటి కొలేటరల్ లేదా థర్డ్ పార్టీ గ్యారెంటీ లేకుండా ఎంఎస్‌ఎంఈలు లోన్లు పొందేందుకు ప్రభుత్వం క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఎంఎస్‌ఎంఈలకు అప్పులివ్వడంపై ప్రభుత్వ బ్యాంకులు స్వతహాగా అసెస్‌మెంట్ ప్రాసెస్‌ను డెవలప్ చేసుకోవాలని తెలిపింది.
రిసీవబుల్స్ (రావాల్సిన పేమెంట్స్) ను క్యాష్‌గా మార్చుకోవడానికి అవకాశం కలిపించే ప్లాట్‌ఫామ్ ట్రేడ్స్(టీఆర్‌ఈడీఎస్) లో జాయిన్ అయ్యేందుకు ఇక నుంచి ఎంఎస్‌ఎంఈల కనీస టర్నోవర్ రూ. 250 కోట్లు ఉంటే సరిపోతుంది. గతంలో ఇది రూ.500 కోట్లుగా ఉంది. దీంతో కొత్తగా 22 సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలు, 7 వేల ప్రైవేట్ కంపెనీలు ఈ ప్లాట్‌ఫామ్‌లో జాయిన్ కావడానికి వీలుంటుంది.
ALSO READ : ఉద్యోగులకు ఊరట కొంచమే
ఎంఎస్‌ఎంఈ క్లస్టర్ల కోసం 24 కొత్త బ్రాంచులను సిడ్బీ ఓపెన్ చేయనుంది. ఒత్తిడిలో ఉన్న ఎంఎస్‌ఎంఈలు ప్రభుత్వ ప్రమోషన్ ఫండ్ నుంచి అప్పు పొందొచ్చని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అన్నారు. అలానే ముద్రా లోన్ల లిమిట్‌ను ప్రస్తుతం ఉన్న రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచారు. విదేశాల్లో తమ ప్రొడక్ట్‌లను ఎంఎస్‌ఎంఈలు అమ్ముకోవడానికి ఈ–కామర్స్ ఎక్స్‌పోర్ట్ హబ్‌ను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం కింద ఏర్పాటు చేయనున్నారు.