నెటిజన్లు ఫిదా : బర్రె పగ తీర్చుకుంది.. ఆకతాయిల నడుం ఇరకొట్టింది

మనిషికైనా, గొడ్డుకైనా సహనం ఉంటుంది. సహనం ఉంది కదా అని రెచ్చిపోతే ఏమవుతుంది. మనిషైనా మూగ జీవాలైన తిరగబడతాయి. అందుకే సహనంగా ఉన్నోళ్లతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని పెద్దలు చెబుతుంటారు.

బెంగళూర్ కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ ఓ సంఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఓ ప్రాంతానికి చెందిన కొందరు ఆకతాయిలు నేషనల్ హైవేపై రెండు ఎడ్ల బండికి గేదెల్ని తగిలించి ఒకరికొకరు పోటీపడ్డారు. అదే సమయంలో ఒకరికొకరూ పోటీపడేందుకు మూగ జీవాల్ని ఇష్టం వచ్చినట్లు కొట్టి హింసించారు. అందులో సహనం నశించిన గేదె రోడ్డు పక్కనే ఉన్న డివైడర్ మీదిగా వెళ్లింది. దీంతో బండిపై ఉన్న ఆకతాయిలు ఎగిరి కిందపడ్డారు. గెదె అక్కడి నుంచి వెళ్లగా.. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆకతాయిలపై బర్రె బలే పగతీర్చుకుందిగా అంటూ సెటైర్లు వేస్తున్నారు.

ప్రస్తుతం ఆ వీడియోకు 1.4 మిలియన్ వ్యూస్ రాగా, 43వేల మంది లైక్ చేశారు.