గోడలు కాదు బ్రిడ్జ్‌‌లు కట్టుకోండి

గోడలు కాదు బ్రిడ్జ్‌‌లు కట్టుకోండి

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతున్న రైతులను అడ్డుకోవడానికి గోడలు కట్టడంపై రాహుల్ ఫైర్ అయ్యారు. గోడలు కాదు బ్రిడ్జ్‌‌లు కట్టాలని వ్యంగ్యంగా పేర్కొన్నారు. అగ్రి చట్టాలపై రైతులతో ప్రభుత్వం 11వ రౌండ్ సమావేశాలు నిర్వహించింది. అయినా ఈ సమస్య కొలిక్కిరాలేదు. ఏడాదిన్నర పాటు చట్టాల అమలును నిలుపుదల చేస్తామని కేంద్రం ఆఫర్ ఇచ్చినా దానికి రైతులు ఒప్పుకోలేదు.