ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లో చెరువులు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను ఇటీవల హైడ్రా కూల్చి వేసిన సంగతి తెలిసిందే.. అయితే బాచుపల్లి ఎర్రకుంటలో కూల్చిన బిల్డింగ్స్ లోని ఐరన్ ను హైడ్రా తీసుకెళ్ళి అమ్ముకుంటుందని బిల్డర్ ఆరోపించారు. వ్యర్ధాలను తొలగిస్తున్నామని చెప్పి తమ బిల్డింగ్ కి వాడిన ఐరన్ ను హైడ్రా తీసుకెళ్లిందని చెబుతున్నాడు. ల్యాండ్ పొజిషన్ మార్చవద్దని కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా కూల్చివేసిన నిర్మాణంలోని ఐరన్ తీసి హైడ్రా అమ్ముకుంటుందని ఆరోపించాడు బిల్డర్.. ఐరన్ తీసుకెళ్తున్న ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు బిల్డర్.
వాళ్లకు నోటీసులు
నిజాంపేట్ లోని ఎర్రకుంట చెరువు FTL పరిధిలో నిర్మించిన మూడు 5 అంతస్తుల బిల్డింగ్స్ ను ఆగస్టు 14 న హైడ్రా కూల్చింది. అయితే నిర్మాణ వ్యర్థాలలోని ఐరన్ తీసుకొని.. ఇతర వ్యర్థాలను అక్కడే వదిలేసి వెళ్లిన నిర్మాణ దారుడికి ఇటీవల అక్టోబర్ 21న హైడ్రా నోటీసులు ఇచ్చింది. దీంతో ఎర్రకుంట చెరువులో ఉన్న వ్యర్థాలను తొలగిస్తుంది హైడ్రా. అనంతరం ఏర్రకుంట చెరువును సుందరీకరించి పునరుజ్జీవనం కల్పిస్తామని తెలిపింది హైడ్రా.
ALSO READ | మూసీ పునరుజ్జీవం చేసి తీరుతం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి