బిల్డర్లకు నియంత్రణ ఉండాలి: కేటీఆర్

బిల్డర్లకు నియంత్రణ ఉండాలి: కేటీఆర్

దేశంలోనే అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా హైదరాబాద్‌ ఐదోసారి ఎంపికైందన్నారు TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బిల్డర్లు లంచాలతో మేనేజ్‌ చేస్తే వారి బ్రాండ్‌ దెబ్బతింటుందన్నారు. హైదరాబాద్ తాజ్‌ డెక్కన్‌లో తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్.. బిల్డర్లు కూడా స్వీయ నియంత్రణ కలిగి ఉండాలన్నారు. నిర్మాణ రంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, హైదరాబాద్‌ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. పట్టణ ప్రాంతాల్లో కూడా భూరికార్డుల ప్రక్షాళన చేయాలని సీఎం కేసీఆర్‌ ధృడసంకల్పంతో ఉన్నారన్నారు. ప్రభుత్వంలో ఉన్న లోపాలను సరి చేసుకుంటూ ముందుకెళ్లే మనకున్న లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు. కేసీఆర్‌కు వేరే ఎజెండాలు లేవని.. అభివృద్దే ఆయన ఎజెండా అని స్పష్టం చేశారు కేటీఆర్.