- జిల్లాలో 351 స్కూళ్ల ఎంపిక, 42 చోట్ల పనులే షురూ కాలే
- గత ప్రభుత్వంలో ఫండ్స్కొరతతో మధ్యలో ఆగిన పనులు
- కొత్తగా వచ్చిన కాంగ్రెస్గవర్నమెంట్పై ఆశలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్సీవాడలోని హైస్కూల్లో బిల్డింగ్పూర్తిగా శిథిలావస్థకు చేరింది. మన ఊరు మన బడి కింద రూ.30 లక్షల ఫండ్స్‌తో క్లాస్ రూమ్స్ శాంక్షన్అయ్యాయి. ఈ ఏడాది జూన్‌లో పనులు షూరూ చేశారు. పునాదులు తీసి, పిల్లర్లు వేసి ఆపేశారు. 6 నెలలు కావొస్తున్నా తిరిగి పనులు ప్రారంభించడం లేదు. ఇక్కడ 6 నుంచి 10 వ క్లాస్వరకు 175 మంది స్టూడెంట్స్చదువుతున్నారు. సరిపడా క్లాస్రూమ్స్లేక అవస్థల పడుతున్నారు.
కామారెడ్డి, వెలుగు : మన ఊరు మన బడి పనులు ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్నట్లు సాగుతున్నాయి. పనులు షురువయ్యి ఏడాదిన్నర కావొస్తున్నా ఫండ్స్కొరతతో ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటి వరకు కంప్లీటయిన పనులకు బిల్స్రాక కాంట్రాక్టర్లు పనులు చేయించడం లేదు. కొన్నిచోట్ల పనులు అసంపూర్తిగా ఉండగా, మరి కొన్ని చోట్ల అసలు షూరూ కాలేదు. సరిపడా క్లాస్‌రూమ్స్ లేకపోవడం, కొన్ని చోట్ల బిల్డింగులు శిథిలం కావడం, మౌలిక వసతులు లేక స్టూడెంట్స్‌కు ఇబ్బందులు పడుతున్నారు.
కామారెడ్డి జిల్లాలో 1,011 గవర్నమెంట్స్కూల్స్ఉన్నాయి. మన ఊరు – మన బడి పథకం మొదటి విడతలో 351 స్కూళ్లను సెలక్ట్ చేశారు. 234 స్కూళ్లకుఒక్కొక్కదానికి రూ.30 లక్షల లోపు, 117 స్కూళ్లకు రూ.30 లక్షల కంటే ఎక్కువ ఖర్చవుతుందని, మొత్తంగా రూ.170 కోట్లు అవసరమని అంచనా వేశారు. 2022, ఫిబ్రవరిలో పనులకు శాంక్షన్ ఇచ్చారు. రూ.30 లక్షల లోపు ఎస్టిమేషన్ఉన్న స్కూళ్లకు ప్రయార్టీ ఇచ్చి పనులు కంప్లీట్చేయాలని అప్పటి ప్రభుత్వం ఆదేశించింది.
ఇదీ పరిస్థితి..
42 స్కూళ్లలో ఇప్పటి వరకు ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. 156 చోట్ల పనులు 70 నుంచి 80 శాతం సివిల్ వర్క్స్ కంప్లీటయ్యాయి. 44 స్కూళ్లకు మాత్రమే ఫర్నిచర్ సప్లయ్ చేశారు. 118 చోట్ల స్కూల్ బిల్డింగ్‌లకు కలరింగ్ వేశారు. రూ.30 లక్షలకు పైగా ఖర్చవుతుందని అంచనా వేసిన 45 స్కూళ్లల్లో పనులు ప్రారంభించి మధ్యలోనే ఆపేశారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద టాయిలెట్స్నిర్మాణాలు జరుగుతున్నాయి.
ఈ పనులు కూడా అసంపూర్తిగానే ఉన్నాయి. ఫండ్స్ రాక మధ్యలోనే ఆపేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు రూ. 62 కోట్ల మేర పనులు జరగగా, కేవలం రూ.41.93 కోట్ల బిల్లులు చెల్లించారు. రూ.20 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో అసంపూర్తి పనులపై దృష్టి సారించి, త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఉన్నతాధికారులకు నివేదించాం
మన ఊరు – మన బడి కింద చేపట్టిన పనులు చాలా చోట్ల కంప్లీట్ అయ్యాయి. కొన్ని చోట్ల పెండింగ్‌లో ఉన్నాయి. పనులు జరిగిన వరకు ఇంజనీరింగ్ ఆఫీసర్లు రికార్డులు చేశారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించాం. పనులు మధ్యలో ఆపేసిన వారికి కూడా త్వరగా పూర్తి చేయాలని సూచించాం.
– రాజు, డీఈవో, కామారెడ్డి