రాంనగర్​లో హైడ్రా కూల్చివేతలు

రాంనగర్​లో హైడ్రా కూల్చివేతలు

 

  • 24 గంటల్లోనే..  కల్లు కాంపౌండ్​నేలమట్టం..  

  •  హైడ్రా పనితీరుపై హర్షం ప్రకటిస్తున్న స్థానికులు 


హైదరాబాద్:   సిటీలోని అడిక్​మెట్​ డివిజన్​ రాంనగర్​లో రోడ్ల నాలాలు, ఆక్రమణలపై జీహెచ్ఎంసీ, హైడ్రా ఫోకస్​ పెట్టింది. రాంనగర్ చౌరస్తాలోని మణెమ్మ కాలనీలో  నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను  నిన్న  హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు.   దీనిపై నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ, రెవెన్యూ ఆఫీసర్లను  ఆయన ఆదేశించారు.  నిర్మాణాలు అక్రమమే అని నిర్ధరించిన అనంతరం హైడ్రో ఆఫీసర్లు ఇవాళ తెల్లవారుజాము నుంచి  కూల్చివేతలు చేపట్టారు.  భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా బుల్డోజర్లతో కూల్చివేతలు చేపట్టింది.   

24 గంటల్లోనే..  కల్లు కాంపౌండ్​నేలమట్టం..  

రాంనగర్​లోని మణెమ్మ గల్లీలోని సర్వే నెంబర్​ 1-9-189 కు చెందిన ఫ్లేస్​లో  విక్రమ్ యాదవ్​​అనే వ్యక్తి  అక్రమంగా కల్లు కాంపౌండ్ కొనసాగుతోందని స్థానికులు రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్​ కు కంప్లైట్​ చేశారు.   దీంతో హైడ్రా కమీషనర్​ రంగనాథ్​ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.  ఆఫీసర్ల నివేదకలో అక్రమ కట్టడాలని తేలడంతో ఇవాళ కూల్చివేతలు మొదలుపెట్టారు. నాలాను అక్రమించి కట్టడాలను ఆఫీసర్లు కూల్చేస్తున్నారు.   కల్లు కాంపౌండ్​లో కల్లును పారబోసి పూర్తిగా సామగ్రిని తొలగించి.. కూల్చివేతలు చేపట్టింది.  హైడ్రా కమీషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించిన 24 గంటలకే చర్యలు ప్రారంభించింది. హైడ్రా పనితీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాధితులను అడ్డుకునేందుకు పోలీస్ బలగాలు భారీగా మొహరించాయి