కడ్తుంటే చూస్తున్రు.. కట్టినంక కూల్చేస్తున్రు.. అధికారుల నిర్వాకం

కడ్తుంటే చూస్తున్రు.. కట్టినంక కూల్చేస్తున్రు.. అధికారుల నిర్వాకం

కాళ్ల మీద పడ్డా కనుకరించలే..

కంది, వెలుగు: ‘కడుతున్నప్పుడు చూస్తున్నరు.. కట్టినంక అనుమతులు లేవంటూ కూలుస్తున్రు.. పర్మిషన్​లకు అప్లయ్​ చేస్తే కావాలనే లేట్​ చేస్తున్రు.. ఇదేందని అడిగితే పర్మిషన్​లు వాళ్ల లిమిట్స్​ కాదంటున్రు..’.. కంది మండల పరిధిలో ఇండ్లు కూల్చివేతకు గురైన బాధితుల ఆరోపణలు ఇవి. శనివారం కంది మండల పరిధిలో పర్మిషన్​ లేని, ఇల్లీగల్​గా చేపట్టిన కన్​స్ట్రక్షన్​లను కూల్చేందుకు స్పెషల్​ డ్రైవ్​ నిర్వహించారు. ఇద్దరు డీఎల్​పీవోలు, నలుగురు ఎంపీవోలు, 10 మంది సెక్రటరీలతో కూడిన టీం ఈ దాడులు చేపట్టింది. కందిలో 4 కమర్షియల్​ షెడ్లు, కవలంపేటలో 1, చేర్యాల గ్రామంలో 3 ఇళ్లను జేసీబీలతో కూల్చేశారు. తాము కష్టపడి కట్టుకుంటున్న ఇండ్లను కూల్చొద్దంటూ బాధితులు ఆఫీసర్ల కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు. చేర్యాల గ్రామంలో అనుమతి లేని వెంచర్​లో చేపట్టిన ఇంటిని కూల్చేశారు. అక్కడే ఉన్న ఇంటి యాజమాని కాళ్లు మొక్కుతా సార్​.. ఇల్లు కూల్చొద్దు, పర్మిషన్​ వచ్చే వరకు మిగతా నిర్మాణం చేపట్టబోనని బతిమిలాడిన ఆఫీసర్లు వినలేదు. నోటీసులో సంజాయిషీ అడిగి ఎలాంటి సమాచారం లేకుండా జేసీబీలతో కూల్చడమేంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పర్మిషన్​ తీసుకోవాల్సిందే..

హెచ్​ఎండీఏ లిమిట్స్​లో ఉన్న అన్ని ఏరియాల్లో తప్పనిసరిగా కమర్షియల్​ కన్​స్ర్టక్షన్​కు హెచ్​ఎండీఎ పర్మిషన్​ తీసుకోవాల్సిందేనని డీఎల్​పీవో సతీశ్​రెడ్డి చెప్పారు. పర్మిషన్​లేకుండా నిర్మాణాలు చేపడితే పనిష్మెంట్​ తప్పదన్నారు. హెచ్​ఎండీఏ అనుమతులు లేని వెంచర్లలలో ఇండ్ల నిర్మాణం చేపడితే చర్యలు ఉంటాయి. ఎల్​ఆర్​ఎస్​ కట్టకుండా ఇంటి నిర్మాణాలు చేపట్టొద్దు. దాడుల్లో డీఎల్​పీవో రాఘవరావు, ఎంపీవోలు శ్రీనివాస్​, యూసూఫ్​, మహేందర్​రెడ్డి, నారాయణ, కంది ఈవో వాణి, సెక్రటరీలు పాల్గొన్నారు.

For More News..

‘అమ్మా పోయొస్త.. పిల్లలు పైలం’.. మళ్లీ వలస బాట పట్టిన పాలమూరు కార్మికులు

కుక్కల దాడిలో 48 గొర్రెలు మృతి

లైసెన్స్‌ ఒక్కటే.. బ్రాంచులు మాత్రం ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెండు, మూడు.. ఇష్టారాజ్యంగా మీ-సేవ సెంటర్లు

పిలిస్తే పెండ్లిళ్లకు.. తెలిస్తే చావులకు..! లీడర్ల తిప్పలు