బుజ్జితల్లి వీడియో సాంగ్ రిలీజ్.. ఎమోషనల్ ట్రీట్ ఇచ్చారుగా..

నాగచైతన్య,  సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న లవ్, యాక్షన్ డ్రామా ‘తండేల్’. ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకకత్వం వహిస్తన్నాడు.  తండేల్ సినిమాలో జ్ఞగా చైతన్య జాలరి యువకుడిపాత్రలో నటిస్తున్నాడు. గుజరాత్ లో జరిగిన ఓ రియల్  ఇన్సిడెంట్ ఆధారంగా దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించినట్లు సమాచారం. ఏ ఈసినిమాకి పాలక సినీ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించాడు. ఇప్పటికే ఈ సినిమానుంచి రిలీజ్ అయిన బుజ్జితల్లి లిరికల్ సాంగ్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటివరకూ ఈ పాటకి 50 మిలియన్ వ్యూస్ వచాయి

అయితే మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. శనివారం ‘బుజ్జి తల్లి’  వీడియో సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు.  ‘నీకోసం వేచుందే నా ప్రాణం... ఓ బుజ్జితల్లి.. నా కోసం ఓ మాటైనా మాటాడే.. నా బుజ్జితల్లి’ అనే పల్లవితో సాగే ఈ హార్ట్ టచింగ్ లవ్‌‌ సాంగ్‌‌ను దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేయగా, జావేద్ అలీ పాడాడు. ప్రముఖ లిరిక్ రైటర్ శ్రీ మణి లిరిక్స్ అందించాడు. ఈ సాంగ్ రిలీజ్ అయిన 3 గంటల్లోనే దాదాపుగా 2 లక్షల పైచిలుకు వ్యూస్ వచ్చాయి. ఓవరాల్ గా సాంగ్ చూస్తే విజువల్స్, లిరిక్స్, మేకింగ్ ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి.

ఈ విషయం ఇలా ఉండగా తండేల్ సినిమా నుంచి ఇప్పటివరకూ రెండు సాంగ్స్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వస్తోంది. తండేల్ సినిమా ఫిబ్రవరి 7న వరల్డ్ వైడ్ ప్యాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కానుంది. దీంతో చిత్ర యూనిట్ త్వరగతిన షూటింగ్ కంప్లీట్ చేసందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.