పాలమూరు, వెలుగు: పాలమూరు పట్టణంలో కల్కి 2898ఏడీ సినిమాలో వినియోగించిన బుజ్జి వాహనం సందడి చేసింది. బుజ్జి వాహనాన్ని చూసేందుకు ప్రభాస్ అభిమానులు, యువకులు తరలివచ్చారు. యువత సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. కల్కి సినిమా ప్రదర్శిస్తున్న ఏవీడీ థియేటర్లో అభిమానులను నాగ్ అశ్విన్ శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు జిల్లాకు రావడం సంతోషంగా ఉందన్నారు.
తమ ఫ్యామిలీ ఇక్కడిదేనని, కల్కి సినిమాను ఆదరించడం సంతోషంగా ఉందని, ప్రభాస్ ఫ్యాన్స్ కు థ్యాంక్స్ చెప్పారు. పార్ట్–2 సినిమాకు ఇంకా సమయం ఉందని తెలిపారు. అనంతరం డైరక్టర్ బుజ్జి వాహనంపై ఎక్కి అభివాదం చేశారు.